Airports Authority of India (AAI),at present,would not close the Visakhapatnam international airport,though the Andhra Pradesh governmentwanted it shut once the Bhogapuramairport starts operations,said a senior AAI official said. GMR Airports Limited (GAL), a subsidiary of GMR Infrastructure Ltd, has emerged as highest bidder for the development, operations and management of the greenfield international airport at Bhogapuram, Andhra Pradesh, on a PPP (public-private partnership) basis. The proposed greenfield airport site lies on the border of Visakhapatnam and Vizianagaram districts, and is approximately 45 km from Visakhapatnam.
#Visakhapatnamairport
#AAI
#Bhogapuramairport
#AirportsAuthorityofIndia
#andhrapradesh
విశాఖపట్నం విమానాశ్రయం మూత పడుతుందంటూ కొద్దిరోజులుగా రాష్ట్రంలో వదంతులు వినిపిస్తున్నాయి. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన తరువాత వైజాగ్ విమానాశ్రయాన్ని మూసివేస్తారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దీన్ని బలపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లోనూ కొందరు ప్రముఖుల పేరిట ఇదే విషయం వెల్లడైంది. వాటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం పుల్ స్టాప్ పెట్టేసింది. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ ను మూసివేయబోమని స్పష్టం చేసింది. భోగాపురం అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా దీన్ని కొనసాగిస్తామని భారత విమానాశ్రయాల ప్రాధీకార సంస్థ (ఎఎఐ) వెల్లడించింది. భోగాపురంలో కొత్తగా అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ కిందటేడాది నవంబర్ 26న నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.